Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇటు మెగాస్టార్ .. అటు సూపర్ స్టార్!

Megastar And Supar Star Movies Special
Advertisement
  • ఆగస్టు 11న వస్తున్న మెగాస్టార్ 'భోళాశంకర్' 
  • ఒకరోజు ముందే కోలీవుడ్ లో విడుదలవుతున్న 'జైలర్'
  • అక్టోబర్ 20న వస్తున్న బాలయ్య 'భగవంత్ కేసరి'
  • అదే నెల 19న థియేటర్లలో దిగిపోతున్న విజయ్ మూవీ
Advertisement
మెగా అభిమానులంతా ఇప్పుడు 'భోళాశంకర్' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన మాస్ యాక్షన్ మూవీ ఇది. చిరంజీవి సరసన నాయికగా తమన్నా నటిస్తుండగా, ఆయన చెల్లెలు పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఇక కోలీవుడ్ లో రజనీ అభిమానులంతా, ఆయన తాజా చిత్రమైన 'జైలర్' కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగే యాక్షన్ మూవీనే. లుక్ పరంగా రజనీ మంచి మార్కులు కొట్టేశాడు. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్కరోజు తేడాతో ఇటు మెగాస్టార్ .. అటు సూపర్ స్టార్ సినిమాలు థియేటర్లకు రానున్నాయి. రజనీ సినిమా తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున ఇక్కడి ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉంది. అలా మెగాస్టార్ .. సూపర్ స్టార్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే విధంగా దసరాకి ఒకరోజు తేడాతో ఇక్కడ బాలకృష్ణ 'భగవంత్ కేసరి' .. అటు లోకేశ్ కనగరాజ్ తో విజయ్ చేసే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. 

Advertisement
Advertisement
Chiranjeevi
Bhola Shankar
Rajanikanth
Jailer
Movie

More Telugu News